బీజేపీలోకి జయసుధ ?

బీజేపీలోకి జయసుధ ?

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఆపరేషన్‌ ఆకర్ష్‌ను వేగవంతం చేసింది. అందులో భాగంగా బీజేపీ జాయినింగ్‌ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేంద్ర మాజీ ఎమ్మెల్యే, సినీ నటి జయసుధతో సమావేశమై పార్టీలో చేరికకు సంబంధించిన చర్చలు దాదాపు పూర్తి చేసినట్లు సమాచారం. ఈ నెల 21న మునుగోడులో జరిగే సభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సమక్షంలో జయసుధ బీజేపీలో చేరుతారంటూ ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో జయసుధ స్పందించారు. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన లేదని జయసుధ స్పష్టం చేశారు. 21న బీజేపీలో చేరడం లేదన్నారు. బీజేపీ నేతల ముందు ఆమె కొన్ని ప్రతిపాదనలు పెట్టినట్లు తెలుస్తోంది. వాటిని అంగీకరిస్తేనే బీజేపీలో చేరేందుకు సిద్ధమని చెప్పినట్లు  తెలిసింది. ఢిల్లీ పెద్దలు మాట్లాడి హామీ ఇస్తే బీజేపీలో చేరేందుకు ఓకే చెప్పానని ఆమె చెప్పినట్లు సమాచారం.

 

Tags :