అమెరికాలో తెలుగు విద్యార్థులపై కాల్పులు

అమెరికాలో తెలుగు విద్యార్థులపై కాల్పులు

అమెరికాలోని చికాగాలో తెలుగు విద్యార్థులపై నల్లజాతీయులు కాల్పులు జరిపిన ఘటనలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెంందిన విద్యార్థి మృతి చెందారు. ఈ కాల్పుల్లో గాయపడిన మరో విద్యార్థి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు తెలిసింది. చికాగోలోని గవర్నర్‌ స్టేట్‌ యూనివర్సిటీలో చదువుకుంటున్న విజయవాడకు చెందిన దేవాన్స్‌, తెలంగాణలోని సంగారెడ్డికి చెందిన సాయిచరణ్‌, మరో విద్యార్థితో కలిసి వాల్‌మార్ట్‌కు వెళ్తాన్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా నల్ల జాతీయులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో దేవాన్ష్‌, సాయిచరణ్‌ శరీరాల్లోకి బుల్లెట్లు దూసుకుపోయాయి. తీవ్రంగా గాయపడిన వీళ్లిద్దరినీ హుటాహుటిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. దేవాన్ష్‌ ప్రాణాలు దక్కలేదు.

 

 

Tags :