ఇది అత్యంత దారుణమైన దాడి : జెలెన్‌స్కీ

ఇది అత్యంత దారుణమైన దాడి  :  జెలెన్‌స్కీ

ఉక్రెయిన్‌లో క్రెమెన్‌ చుక్‌ నగరంలోని ఒక రద్దీగా ఉండే షాపింగ్‌ మాల్‌పై రష్యా క్షిపణి దాడికి పాల్పడింది. ఈ ఘటనలో 10 మంది వరకు మరణించగా, 40 మందికి పైగా గాయాలైనట్టు తెలుస్తున్నది. వారిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉందని  పొల్టావా గవర్నర్‌ దిమిత్రో ల్యూనిన్‌ వెల్లడించారు. జనాలు ఎక్కువగా ఉన్న సమయాన్ని చూసుకుని, రష్యా బాలిస్టిక్‌ గైడెడ్‌ క్షిపణులతో విరుచుకుపడిరదని పొల్టావా గవర్నర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.  దాడి సమయంలో మాల్‌లో వెయ్యి మందికి పైగా ఉన్నట్టు సమాచారం. అయితే మరణాలు, క్షతగాత్రుల సంఖ్యపై అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నది. దాడి ఘటనను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా స్పందించారు. ఇది అత్యంత దారుణమైన దాడి అని వ్యాఖ్యానించారు.

 

Tags :