ఎలన్ మస్క్ మరో హెచ్చరిక..రాబోయే మూడు నెలల్లో

అమెరికా ఆర్థిక మాంద్యం చేరువలో ఉందని టెస్లా మోటార్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎలన్ మస్క్ మరోమారు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తమ సంస్థలో రాబోయే మూడు నెలల్లో పది శాతం వేతన జీవులను తొలగించక తప్పదని ఆయన ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆర్థిక వ్యవస్థను తలుచుకుంటే చాలా బాధేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. అప్పట్లోనే ఉద్యోగుల తొలగింపు గురించి ప్రస్తావించారు. వేతనాలకు పనిచేసే వారిని మాత్రమే తొలగిస్తామని గంటల ప్రాతిపదికన పార్ట్‌టైం ఉద్యోగాలు చేసేవారిని తొలగించబోమని మస్క్ తెలిపారు. వర్క్ ఫ్రం హోం విధానాన్ని ఇక ఏమాత్రం కొనసాగించబోమని మస్క్ ఇదివరకే స్పష్టం చేశారు.
Tags :