దళపతి విజయ్, వంశీ పైడిపల్లి, దిల్ రాజుల దళపతి#66 ఫస్ట్ లుక్ అప్డేట్

దళపతి విజయ్, వంశీ పైడిపల్లి, దిల్ రాజుల దళపతి#66 ఫస్ట్ లుక్ అప్డేట్

దళపతి విజయ్, వంశీ పైడిపల్లి  కాంబినేషన్‌లో  దళపతి#66 అనే చిత్రం రాబోతోంది. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఒకటి వచ్చింది.  దళపతి#66 ఫస్ట్ లుక్ అప్డేట్‌ను మేకర్లు ప్రకటించారు. దళపతి విజయ్ మొదటి సారిగా తెలుగు సినిమాను చేస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తమిళంలో కూడా రిలీజ్ చేయబోతోన్నారు. అలా మొత్తానికి విజయ్ తొలిసారిగా ఇలా ద్విభాష చిత్రాన్ని చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా మీద బజ్ విపరీతంగా పెరిగింది. ఇదో ఫ్యామిలీ డ్రామా యాక్షన్ మూవీ అని తెలుస్తోంది. ఇందులో భారీ తారాగణం ఉంది. శరత్ కుమార్, కిక్ శ్యామ్ వంటి వారు ఇందులో నటిస్తున్నారు.

ప్రకాష్ రాజ్ కూడా ముఖ్య పాత్రలో కనిపించబోతోన్నాడు. ఇక కోలీవుడ్ టాప్ కమెడియన్ యోగి బాబుకి ఓ ఇంపార్టెంట్ రోల్ ఉంది. అలా మొత్తానికి సినిమాను భారీ స్థాయిలో దిల్ రాజు తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో విజయ్ సరసన రష్మిక మొదటి సారిగా నటిస్తోంది. రష్మికకు అసలే విజయ్ అంటే మహా ఇష్టం. మొత్తానికి దళపతితో తాను నటిస్తున్నాను అని రష్మిక గాల్లో తేలిపోయింది. సినిమా ప్రారంభోత్సవం నాడు ఫ్యాన్ గర్ల్ మూమెంట్‌ను ఎంజాయ్ చేసింది. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను జూన్ 21న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. జూన్ 21న సాయంత్రం ఆరు గంటల ఒక్క నిమిషానికి ఈ ఫస్ట్ లుక్‌ను విడుదల చేయబోతోన్నట్టు ప్రకటించేశారు..

https://twitter.com/SVC_official/status/1538470668617932800

 

Tags :