ఖమ్మం ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన తాతా మధు

ఖమ్మం ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన తాతా మధు

ఖమ్మం స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా తాతా మధును ఖరారు చేశారు. సోమవారం ఆయన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి నామినేషన్‌ దాఖలు చేశారు. కలెక్టర్‌ వీపీ గౌతమ్‌కు నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. మంత్రి అజయ్‌ నేతృత్వంలో పార్టీ నేతలు అభ్యర్థి విజయం కోసం దృష్టి సారించారు. తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామానికి చెందిన తాతా మధును పార్టీ ఎంపిక చేసిన సంగతి విదితమే.  సోమవారం టీఆర్‌ఎస్‌ జిల్లా పార్టీ కార్యాలయంలో తాతా మధుకు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ బీఫామ్‌ అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడతోపాటు ఎమ్మెల్యేలు రాములు నాయక్‌, హరిప్రియా నాయక్‌, మెచ్చా నాగేశ్వర్‌రావు, జిల్లా పరిషత్‌ చైర్మన్లు లింగాల కమల్‌రాజు, కోరం కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

కాగా తాతా మధు గతంలో అమెరికాలో ఉన్నప్పుడు ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా)లో కీలకపాత్ర పోషించారు. తానా కార్యదర్శిగా కూడా వ్యవహరించారు. అలాగే అట్లాంటా తెలుగు అసోసియేషన్‌ (తామా)కు అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. ఆయనను ఎమ్మెల్సీగా ఎంపిక చేయడం పట్ల పలువురు తానా నాయకులు, ఎన్నారైలు హర్షం వ్యక్తం చేశారు.

 

Tags :