రివ్యూ : నాగార్జున ట్రై చేసిన యాక్షన్ థ్రిల్లర్ 'ది ఘోస్ట్'

రివ్యూ : నాగార్జున ట్రై చేసిన యాక్షన్ థ్రిల్లర్ 'ది ఘోస్ట్'

తెలుగుటైమ్స్. నెట్ రేటింగ్ : 2.5/5

నిర్మాణ సంస్థలు : శ్రీ వెంకటేశ్వర సినిమాస్ అండ్ నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్, నటీనటులు: నాగార్జున, సోనాల్ చౌహాన్, గుల్ పనాగ్, అనికా సురేంద్రన్, మనీష్ చౌదరి, రవివర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, బిలాల్ హోంసైన్, సిమ్మీ సంగీతం: భరత్, సౌరభ్, మార్క్ కె రాబిన్ సినిమాటోగ్రఫీ :ముఖేష్ జి ఎడిటర్ : ధర్మేంద్ర కాకరాల నిర్మాతలు: సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ దర్శకత్వం : ప్రవీణ్ సత్తారు

విడుదల తేదీ: 05.10.2022

డిఫెరెంట్ జోనర్లలో, డిఫెరెంట్ చిత్రాలతో ఇండస్ట్రీ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపుతో టాలీవుడ్‌లో వైవిధ్యమైన సినిమాలుతో సెల్యులాయిడ్ సైన్స్ఈస్ట్ అక్కినేని నాగార్జున ఒకరు. యాక్షన్ మూవీస్‌తో కింగ్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ ‘మన్మథుడు’ టచ్ చేయని జోనర్ అంటూ ఏమీ లేదు. అయితే, గడిచిన కొన్నేళ్లుగా నాగార్జున ట్రై చేసిన యాక్షన్ థ్రిల్లర్స్‌ ఏవీ ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేదు. అయినప్పటికీ ప్రవీణ్ సత్తారు లాంటి ప్రతిభావంతుడైన దర్శకుడిపై నమ్మకంతో మరోసారి యాక్షన్ థ్రిల్లర్‌లో నటించారు. అదే ‘ది ఘోస్ట్’. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సారి యాక్షన్ థ్రిల్లర్ తో ముందుకొచ్చిన నాగార్జున ఏ మేరకు ఆకట్టుకున్నారో సమీక్ష లో తెలుసుకుందాం.

కథ:

విక్రమ్ (నాగార్జున) ఇంటర్ పోల్ ఆఫీసర్, తన ప్రియురాలు ప్రియ (సోనాల్ చౌహాన్)తో కలిసి దుబాయ్‌ లో పనిచేస్తుంటాడు. అండర్ వరల్డ్‌ను రూపుమాపడానికి ఇంటర్‌పోల్‌లో ఉద్యోగాన్ని వదిలేస్తాడు. మరోవైపు, ఊటీలో అనుపమా నాయర్ (గుల్ పనగ్) భర్త చనిపోవడంతో నాయర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌కి చైర్మన్‌గా వ్యవహరిస్తుంటుంది. ఆమెకు అదితి (అనిఖా సురేంద్రన్) అనే కూతురు ఉంటుంది. వ్యాపార, ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో వీరిద్దరికీ శత్రువుల నుంచి ఆపద పొంచి ఉంటుంది. తనకున్న ఆందోళనను తెలియజేస్తూ, సమస్యను పరిష్కరించమని విక్రమ్‌ని అడగడం జరుగుతుంది. వారిని కాపడటానికి దుబాయ్ నుంచి విక్రమ్ ఊటీకి వస్తాడు. ఆ తరవాత ఏం జరిగింది? అసలు విక్రమ్‌కి,అనుపమా నాయర్ కి ఉన్న సంబంధం ఏంటి? శత్రువులు ఎవరో విక్రమ్ ఎలా కనిపెట్టాడు? అను, అదితిలను కాపాడాడా? అనేదే సినిమా.

నటీనటుల హావభావాలు:

సినిమా మొత్తాన్ని నాగార్జున వన్ అండ్ ఓన్లీ గా నడిపించారు. సినిమా ప్రారంభంలో సోనాల్ చౌహన్‌తో రొమాన్స్ దగ్గర నుంచి క్లైమాక్స్‌లో కత్తి పట్టుకుని తలకాయలు కోసే వరకు నాగార్జున స్వాగ్ ఓ రేంజ్‌లో కొనసాగింది. నాగార్జున యాక్షన్ పెర్ఫార్మెన్స్ చూస్తుంటే ఆయన 60 ఏళ్లు దాటిన వ్యక్తిలా అనిపించలేదు. అంత ఈజీగా, స్టైలిష్‌గా చేశారాయన. ఆయన కెరీర్‌లో చేసిన మోస్ట్ వయలెంట్ రోల్ ఇది. ఆయనకు తోడుగా ప్రియ పాత్రలో సోనాల్ చౌహన్ అదరగొట్టింది. సోనాల్ చౌహాన్ కేవలం గ్లామర్ షో కి మాత్రమే కాకుండా చాలా చక్కని నటనని కనబరిచింది. ఆమె పాత్రకు ఈ సినిమా లో మంచి స్కోప్ ఉంది. ఆమె సినిమా కోసం పెట్టిన ఎఫర్ట్స్ చాలా క్లియర్ గా కనిపిస్తాయి. తెలుగులో ఆమె తొలిసారి ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించింది. యాక్షన్ సీన్స్‌లో నాగార్జునతో పోటీగా చేసింది. అను పాత్రలో బాలీవుడ్ నటి గుల్ పనగ్ పెద్దగా ప్రభావం చూపించలేదు. ముఖ్యంగా తెలుగు డబ్బింగ్ ఆమెకు కరెక్ట్‌గా సెట్ కాలేదు. ఈ పాత్రకు దర్శకుడు నదియా, కుష్బూ లాంటి దక్షిణాది సీనియర్ నటిని ఎంపిక చేసుకుంటే బాగుండేది. ‘విశ్వాసం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అనిఖా సురేంద్రన్.. అదితి పాత్రకు న్యాయం చేసింది. తల్లి మాటను లెక్కచేయని కూతురుగా మెప్పించింది. జయప్రకాశ్, శ్రీకాంత్ అయ్యంగార్, మనీష్ చౌదరి, రవి వర్మ తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించారు.

సాంకేతికవర్గం పనితీరు:

ప్రవీణ్ సత్తారు టేకింగ్‌కు ముకేశ్ సినిమాటోగ్రఫీ తోడవడంతో వెండితెరపై యాక్షన్ సీన్స్ చాలా బాగా వచ్చాయి. అరేబియా ఎడారితో పాటు ఊటీలో పశ్చిమ కనుమలను చాలా అందంగా చూపించారు కెమెరామేన్. నేపధ్య సంగీత దర్శకుడు మార్క్ కె రాబిన్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఆయన అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సీన్స్‌ను బాగా ఎలివేట్ చేశాయి. థియేటర్ మారుమోగిపోయేలా నేపథ్య సంగీతం ఉన్నా.. డైలాగులు స్పష్టంగా అర్థమయ్యేలా మిక్సింగ్ చేశారు. కొత్త సంగీత ధ్వయం భరత్-సౌరభ్ అందించిన పాటలు బాగున్నాయి. కథలో భాగంగా వెళ్లిపోయాయి. ఎడిటర్ ధర్మేంద్ర కాకరాల.. సినిమాను ఎంగేజింగ్‌గా కట్ చేశారు. నిర్మాణ విలువలు అత్యద్భుతంగా ఉన్నాయి. సన్నివేశాలు మరింత అందంగా కనపడటానికి చాలా ఖర్చు చేశారు మేకర్స్.

విశ్లేషణ:

‘ది ఘోస్ట్’ కథ కొత్తదేమీ కాదు. ఇలాంటి కథలు హిందీలో, తెలుగులో చాలానే వచ్చాయి. అయినప్పటికీ ఈ కథను దర్శకుడు ప్రవీణ్ సత్తారు తన కథనంతో కొత్తగా చూపించాలని ప్రయత్నించారు. ఆ ప్రయత్నం కాస్త వర్కౌట్ అయ్యింది. సినిమా నెమ్మదిగా మొదలై.. అరగంట తరవాత అసలు కథలో వెళ్లింది. ఇక అక్కడి నుంచి సుమారు రెండు గంటలపాటు యాక్షన్‌తో దడదడలాడించారు. అరేబియా ఎడారిలో నాగార్జున ఇంట్రడక్షన్ సీన్ మొదలుకొని.. సెకండాఫ్ మొత్తం యాక్షన్‌ సన్నివేశాలతో థియేటర్ మారుమోగిపోయింది. నాగార్జున కెరీర్‌లో ‘ది మోస్ట్ వయలెంట్ యాక్షన్ థ్రిల్లర్’ ఇదే అని చెప్పాలి. రక్తపాతాన్ని ఓ రేంజ్‌లో చూపించారు దర్శకుడు. యాక్షన్ సినిమాలను ఎక్కువగా ఇష్టపడే ఆడియన్స్‌కు ‘ది ఘోస్ట్’ తప్పక నచ్చుతుంది.

 

Tags :
ii). Please add in the header part of the home page.