అగ్రరాజ్యంలో భారీగా రాజీనామాలు .. ఎందుకో తెలుసా?

అగ్రరాజ్యంలో భారీగా రాజీనామాలు .. ఎందుకో తెలుసా?

అగ్రరాజ్యం అమెరికాలో ఉద్యోగాలను వదులుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. గతేడాది నవంబరులో ఏకంగా 45 లక్షల మందికి పైగా ఉద్యోగాలకు రాజీనామా చేసినట్టు ఆ దేశ కార్మికశాఖ పేర్కొంది.  ఉద్యోగాలు మానేస్తున్న వారి సంఖ్య సెప్టెంబరుతో పోలిస్తే 3 శాతం పెరిగినట్లు తెలిపింది.  ఉద్యోగాలు వదులుకుంటున్న వారిలో ఫుడ్‌ సర్వీసెస్‌ కార్యకలాపాలు నిర్వహించే వారే ఏకంగా 1.59 లక్షల మంది ఉన్నట్టు ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడిరచాయి. వీరి తర్వాతి స్థానంలో ఆరోగ్య సంబంధిత రంగాల వారు 52 వేల మంది, రవాణా సేవలకు సంబంధించిన వారు 33 వేల మంది ఉన్నట్లు పేర్కొన్నాయి. నవంబరులో ఏకంగా 1.6 కోట్ల ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చినట్టు కార్మికశాఖ తెలిపింది.

ఉద్యోగాలను వదిలేస్తున్న కార్మికులు అధిక వేతనం లభించే మార్గాలవైపు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. కరోనా సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందని ఫలితంగా జాబ్‌ మార్కెట్‌ పుంజుకుందని నిపుణులు చెబుతున్నారు. గతేడాది  ఏప్రిల్‌ నుంచి 1.85 కోట్ల మంది ఉపాధి పొందారని, ప్రస్తుతం నిరుద్యోగిత రేటు 4.2 శాతం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు.

 

Tags :