ఐటీఆర్ గడువు పొడిగింపు : కేంద్రం

ఐటీఆర్ గడువు పొడిగింపు : కేంద్రం

ఆదాయ పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త. 2020-21 ఆర్థిక సంవత్సరం ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేయడానికి గడువు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) నిర్ణయం తీసుకున్నది. వచ్చే మార్చి 15 వరకు ఈ గడువు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఇంతకుముందు 2021 డిసెంబర్‌ 31తో రిటర్న్స్‌ దాఖలు చేయడానికి తుది గడువు అని పేర్కొన్నది. చివరి రోజు కూడా మరోమారు ఐటీ రిటర్న్స్‌ గడువును పొడిగించేది లేదని  కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి తరుణ్‌ బజాజ్‌ ప్రకటించారు. ఇప్పటి వరకు 2020-21 ఆర్థిక సంవత్సరానికి డిసెంబర్‌ 31 నాటికి 5.89 కోట్ల ఐటీఆర్‌లు ఫైల్‌ య్యాయి.  అయితే ఐటీఆర్‌ గడువును పెంచ యోచనలేదని గతేడాది డిసెంబర్‌లో సృష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా దేశంలో నెలకొన్న కొవిడ్‌ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

 

Tags :