యూపీలో బీజేపీకి భారీ షాక్...

యూపీలో బీజేపీకి భారీ షాక్...

యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే యూపీలో అధికార పార్టీ బీజేపీ నుంచి జోరుగా వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా బీజేపీకి చెందిన మరో మంత్రి పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.  వెనుకబడిన వర్గాలకు చెందిన స్వతంత్ర మంత్రి ధరమ్‌సింగ్‌ సైనీ పార్టీ మారుతున్నట్టు ప్రకటించారు. కాగా ప్రసుత్తం సిట్టింగ్‌ ఎమ్మెల్యే ముకేష్‌ శర్మ రాజీనామా చేసిన గంటల వ్యధిలోనే మంత్రి రాజీనామా చేయడం తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపింది. ఇప్పటికే ఇద్దరు మంత్రులు, ఏడుగురు ఎమ్మెల్యేలు పార్టీని మారిన విషయం తెలిసిందే. పార్టీని వీడిన నాయకులు ప్రధానంగా బీజేపీ అధికార నాయకత్వం వెనుక బడిన వర్గాలపై వివక్ష చూపిస్తుందని, ప్రజా ప్రతినిధులను పట్టించుకోకుండా, అగౌరవ పర్చిందని ఎద్దేవా చేసినట్లు తెలుస్తోంది.

 

Tags :