అమెరికాకు హైతీ తాకిడి!

అమెరికాకు హైతీ తాకిడి!

అమెరికాకు పెద్దఎత్తున తరలి వస్తున్న హైతీ వలసదారుల్ని తిప్పిపంపే చర్యల్ని అమెరికా అధికారులు ప్రారంభించారు. హైతీయన్లు కొద్ది రోజులుగా మెక్సికో వైపు నుంచి అధిక సంఖ్యలో టెక్సాస్‌ సరిహద్దు నగరమైన డెల్‌రియోలోకి ప్రవేశిస్తున్నారు. రియోగ్రాండ్‌ నది వంతెన దిగువన శబిరాలు ఏర్పాటు చేసుకున్నారు. లాటిన్‌ అమెరికా, బ్రెజిల్‌ తదితర చోట్ల స్థిరపడిన హైతీయన్లు ఆయా ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు సన్నగిల్లడంతో ఇప్పుడు అమెరికా ఆశ్రయాన్ని కోరుతున్నారు. అలాగే ఇటీవల హైతీలో సంభవించిన తీవ్ర భూకంపం, అధ్యక్షుడి హత్య వంటి పరిణామాలతో వారు తమ దేశానికి వెళ్లడానికి భయపడుతున్నారు. వీరు ఒక్కసారిగా వేల సంఖ్యలో డెల్‌రియోలోకి తరలి రావడంతో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వంతెన కింద 14,500 మంది ఉన్నట్టు డెల్‌రియో మేయర్‌ తెలిపారు. వలసదారుల ఒత్తిడి పెరగడంతో మెక్సికో వైపు టెక్సాస్‌ సరిహద్దు ప్రాంతాన్ని అమెరికా మూసివేసింది.

 

Tags :