వాషింగ్టన్ లో మార్చ్ ఫర్ అవర్ లైవ్స్ పేరిట... భారీ ర్యాలీ

వాషింగ్టన్ లో మార్చ్ ఫర్ అవర్ లైవ్స్ పేరిట... భారీ ర్యాలీ

దేశంలో అమాయకుల ప్రాణాలు తీస్తున్న తుపాకీ సంస్కృతి తమకు వద్దే వద్దని అంటూ అమెరికన్లు గళమెత్తారు. ప్రాణాలు తీస్తున్న ఆయుధాలను నియంత్రించవలసిందేనని చట్ట సభ్యులను వారు కోరుతున్నారు. ఇటీవల అమెరికాలో వరుసగా చోటు చేసుకుంటున్న కాల్పుల ఘటనలకు వ్యతిరేకంగా వారు కదం తొక్కారు. వాషింగ్టన్‌లోని స్మారక మైదానం నేషనల్‌ మాల్‌ వద్ద వేల సంఖ్యలో అమెరికన్లు భారీ ప్రదర్శన నిర్వహించారు. మార్ఛ్‌ ఫర్‌ అవర్‌ లైన్స్‌ పేరిట చేపట్టిన ఈ ర్యాలీలో సుమారు 50 వేల మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరసనకారులు తుపాకీ  సంస్కృతికి చరమగీతం పాడేలా అమెరికా కాంగ్రెస్‌ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అదే విధంగా దేశంలోని దాదాపు 54 రాష్ట్రాల్లో తుపాకీ సంస్కృతికి వ్యతిరేకంగా కొన్ని రోజులుగా అమెరికన్లు తమ గళం వినిపిస్తున్నారు.

ఇంతకు ముందు 2018లో ఫ్లోరిడాలోని పార్క్‌ల్యాండ్‌లో జరిగిన కాల్పుల ఘటనలో 17 మంది చనిపోయిన సందర్భంగా కూడా ఇదే విధంగా మార్చ్‌ ఫర్‌ అవర్‌ లైవ్స్‌ పేరుతో అమెరికన్లు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఇప్పుడు రెండవ సారి తుపాకీ సంస్కృతికి తెర దించవలసిందేనని వారు చట్ట సభ్యులను కోరుతున్నారు.

 

Tags :