కాలినడకన మూడు దేశాల పర్యటన

కాలినడకన మూడు దేశాల పర్యటన

కాలినడకన భారత్‌, నేపాల్‌, భూటాన్‌ దేశాల్లో పర్యటించాలని ముగ్గురు యువకులు నిర్ణయించారు. 15 వేల కిలోమీటర్లు నడవాలన్నది వారి లక్ష్యం. కేరళకు చెందిన జుబైర్‌, సినాన్‌, నవనీత్‌ అనే ముగ్గురు యువకులు అక్టోబర్‌ 15న బయలుదేరిన రోజుకు 25-30 కిలోమీటర్ల వంతున నడుస్తున్నారు. జుబైర్‌ దుబాయిలో ఉద్యోగాన్ని వదిలి పాదయాత్రలో పాల్గొనేందుకు వచ్చారు. నవనీత్‌ కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థి. సినాన్‌ పాత్రికేయుడు. కరోనా నుంచి విముక్తి పొందేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తూ, సరైన వ్యాయామంతో ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని ప్రజల్లో జాగృతి కల్గిస్తున్నట్లు తెలిపారు.  కర్ణాటకలోని ఉత్తరకన్నడ జిల్లా కార్వార పట్టణానికి చేరుకున్నారు. రోజూ తెల్లవారుజామున పాదయాత్ర ప్రారంభించి, చీకటి పడే వరకు నడుస్తున్నట్లు తెలిపారు.

 

Tags :