తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు గురువారంవైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి సమక్షంలో వేదమంత్రోచాóరేణల మధ్య మంగళవాయిద్యాలు మోగుతుండగా అర్చక స్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడ ధ్వజాన్ని ఎగురవేశారు. వాసుదేవ భట్టాచార్యులు కంకణభట్టర్‌గా వ్యవహరించారు. సకల దేవతలను, అష్టదిక్పాలకులను, సప్తమరుత్తులను (దేవతా పురుషులు), రుషిగణాన్ని, సకల ప్రాణికోటిని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ గరుడాళ్వార్‌ ధ్వజస్తంభాన్ని అధిరోహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిరోజు రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు శ్రీవారి పెద్ద శేషవాహన సేవను శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఏడు తలల శేషవాహనంపై పరమపదనాథుని అలంకారంలో అనుగ్రహించారు. ఈ కార్యక్రమంలో పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, ఈఓ  జవహర్‌రెడ్డి దంపతులు తదితరులు పాల్గొన్నారు. 

 

Tags :