టి.ఎల్‌.సి.ఎ, తానా మాతృదినోత్సవ వేడుకలు

టి.ఎల్‌.సి.ఎ, తానా మాతృదినోత్సవ వేడుకలు

తెలుగు లిటరరీ కల్చరల్‌ అసోసియేషన్‌ (టి.ఎల్‌.సి.ఎ), ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) న్యూయార్క్‌ విభాగం ఆధ్వర్యంలో మాతృ దినోత్సవ వేడుకలు మే 1న ఘనంగా నిర్వహించారు. మహిళలకు ప్రత్యేకంగా నిర్వహించిన ఈ వేడుకలలో సుమారు 300 మంది మహిళలు పాల్గొని విజయవంతం చేశారు. జ్యోతి ప్రజ్వలనతో వేడుకలను ప్రారంభించారు. మహిళల నృత్య ప్రదర్శనలు, ఫ్యాషన్‌ షో, ర్యాఫుల్‌ బహుమతులు, వంటల పోటీలు మరియు ఆట పాటల వంటి సరదా కార్యక్రమాలు అందరినీ ఆహ్లాదపరిచాయి. సాధన పైళ్ల, నీలిమ విదియాల, మమతా రెడ్డి, డాక్టర్‌ భారతి రెడ్డి మరియు కల్పన వనమ ఫ్యాషన్‌ షో న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.

ఈ మాతృ దినోత్సవ వేడుకలలో తెలుగు సినీ సీనియర్‌ నటి గీత, నార్త్‌ హెంప్‌ స్టెడ్‌ టౌన్‌ క్లర్క్‌ రాగిణి శ్రీవాత్సవ, అసిస్టెన్స్‌ కమ్యూనిటీ సేవల అసిస్టెంట్‌ కమీషనర్‌ హ్యారీ బ్రార్‌, లాంగ్‌ ఐలాండ్‌ భారతీయ సంఘం అధ్యక్షులు బీనా సబాపతి హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరికి టి.ఎల్‌.సి.ఎ మరియు తానా న్యూయార్క్‌ విభాగం కార్యవర్గ సభ్యులు గౌరవ సత్కారం చేసారు. తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం ఛైర్మన్‌ కృష్ణ మద్దిపట్ల ఆహుతులనుద్దేశించి ప్రసంగించగా, అధ్యక్షులు జయప్రకాశ్‌ ఇంజపూరి టి.ఎల్‌.సి.ఎ కి ఎప్పుడూ తోడు నీడలా ఉంటూ సాయం చేస్తున్న స్థానిక మహిళానేతలను ఘనంగా సన్మానించారు. టి.ఎల్‌.సి.ఎ కార్యవర్గ సభ్యులకు రాగిణి శ్రీవాత్సవ అనులేఖనం అందించడం విశేషం. టి.ఎల్‌.సి.ఎ నుంచి మాధవి కోరుకొండ, సుధా రాణి మన్నవ మరియు అరుంధతి అడుప, అలాగే తానా న్యూయార్క్‌ విభాగం నుంచి శిరీష తూనుగుంట్ల, దీపిక సమ్మెట, సుచరిత అనంతనేని, యమున మన్నవ, మరియు శైలజ చల్లపల్లి మదర్స్‌ డే ప్రత్యేకంగా ఈ వేడుకలను పక్కా ప్రణాళికతో ఘనంగా ఏర్పాట్లు చేసి నిర్వహించారు. అలాగే తానా, టి.ఎల్‌.సి.ఎ మిగతా కార్యవర్గ మరియు బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ సభ్యులు డాక్టర్‌ పూర్ణ అట్లూరి, డాక్టర్‌ జగ్గారావు అల్లూరి, ఉదయ్‌ కుమార్‌ దొమ్మరాజు, నెహ్రూ కఠారు, సుమంత్‌ రామిశెట్టి, దిలీప్‌ ముసునూరు తదితరులు మాతృ దినోత్సవ వేడుకలలో పాల్గొని తమ సహాయసహకారాలు అందించారు.

ప్రముఖ గాయని, వ్యాఖ్యాత దీప్తి అమ్మలకు సంబంధించి ప్రత్యేకంగా పాటలు పాడి అలరించారు. అలాగే దీప్తి పాడిన కొన్ని ట్రెండీ పాటలకు మహిళలు ఆనందంతో డాన్సులు వేయడం అందరినీ ఆకర్షించింది. న్యూయార్క్‌ లోని స్థానిక కాటిలియన్‌ రెస్టారెంట్‌ వారు చక్కని వేదిక తోపాటు రుచికరమైన విందు బోజనాలను అందించారు.

 

Click here for Photogallery

 

Tags :