MKOne TeluguTimes-Youtube-Channel

టిఎల్‌సిఎ ఉగాది వేడుకలు ఏప్రిల్‌ 1న

టిఎల్‌సిఎ ఉగాది వేడుకలు ఏప్రిల్‌ 1న

తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (టిఎల్‌సిఎ) శోభకృత్‌ ఉగాది వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్‌ 1వ తేదీన న్యూయార్క్‌లోని ఫ్లషింగ్‌లో ఉన్న హిందూ టెంపుల్‌లో ఈ వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నామని, ఉగాది వేడుకలతోపాటు శ్రీరామనవమి వేడుకలు కూడా జరుగుతాయని టిఎల్‌సిఎ కార్యనిర్వాహక వర్గం తెలిపింది. ఈ వేడుకల్లో భాగంగా పంచాంగ పఠనం, సంగీతం, సాహిత్యం, నాటకం, నాట్యం, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశామని అందరూ ఈ వేడుకలకు హాజరై విజయవంతం చేయాలని నాయకులు కోరారు.

Tags :