భారత్ కు మరో మూడు పతకాలు

భారత్ కు మరో మూడు పతకాలు

జపాన్‍ రాజధాని టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్ లో భారత అథ్లెట్ల జోరు కూడా కొనసాగింది. భారత్‍ అథ్లెట్లు మరో మూడు పతకాలను గెలుచుకున్నారు. పురుషుల హై జంప్‍లో మరియప్పన్‍ తంగవేలు రజతం సాధించగా, భారత్‍కే చెందిన శరద్‍ కుమార్‍ కాంస్యం గెలుచుకున్నాడు. అంతేగాక పురుషుల 10 మీటర్ల ఎయిర్‍ పిస్టల్‍ ఎస్‍హెచ్‍-1 విభాగంలో భారత షూటర్‍ సింగ్‍ రాజ్‍ అధాన కాంస్య పతకం సాధించారు. ఈ క్రీడల్లో భారత్‍ ఇప్పటికే పది పతకాలను సాధించి చరిత్ర సృష్టించింది. ఓ ఒలింపిక్స్లో భారత్‍ రెండంకెలా సంఖ్యలో పతకాలు సాధించడం ఇదే తొలిసారి. ఇటీవలే ముగిసిన సాధారణ ఒలింపిక్స్ లో భారత్‍ ఏడు పతకాలు గెలుచుకున్న విషయం విదితమే.

 

Tags :