మోహన్ బాబు కీలక ప్రకటన...

మోహన్ బాబు కీలక ప్రకటన...

టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సీనియర్‌ హీరో మంచు మోహన్‌ బాబు. ఇలా వెండితెరపై రాణిస్తూనే, మరో వైపు విద్యారంగంలోకి ప్రవేశించారు. సీనియర్‌ నటుడు మోహన్‌బాబు కీలక ప్రకటన చేశారు. నటుడిగా, నిర్మాతగా, విద్యావేత్తగా ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన ఆయన తిరుపతిలో మోహన్‌బాబు యూనివర్సిటీ (ఎంబీయూ) ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తన తల్లిదండ్రులు, అభిమానులు, శ్రేయోభిలాషుల దీవెనలతో మోహన్‌ బాబు యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సగర్వంగా చెబుతున్నానని ట్విటర్‌ వేదికగా తెలిపారు. శ్రీ విద్యానికేతన్‌లో వేసిన విత్తనాలు ఇప్పుడు పెరిగి కల్పవృక్షాలయ్యాయి. 30 ఏళ్ల మీ నమ్మకం. వినూత్నంగా విద్యనందించాలనే నా జీవిత ఆశయం ఇప్పుడు అత్యున్నత స్థాయికి చేరింది. మీకోసం తిరుపతిలో మోహన్‌ బాబు యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నాం. మీ ప్రేమే నా బలం. మీ సహకారం కొనసాగుతుందని నేను బలంగా నమ్ముతున్నా  అని ట్విటర్‌లో మోహన్‌ బాబు తెలిపారు.

1993లో శ్రీవిద్యానికేతన్‌ విద్యా సంస్థను ప్రారంభించారు. ఆ తర్వాత విద్యానికేతన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌, కాలేజీ, ఇంజనీరింగ్‌ కాలేజ్‌, మెడికల్‌ కాలేజ్‌, ఫార్మసీ, పీజీ కాలేజ్‌ ఏర్పాటు చేశారు. ఇప్పుడు మోహన్‌ బాబు యూనివర్సిటీ  ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

 

Tags :