ఒకప్పటి  సహాయమే సాయిని కాపాడిందట.. సాయి వ్యక్తిత్వం పై ఆసక్తికర విషయం

ఒకప్పటి  సహాయమే సాయిని కాపాడిందట.. సాయి వ్యక్తిత్వం పై ఆసక్తికర విషయం

హీరో సాయి ధరమ్ తేజ్.. రెండు రోజుల క్రితం తీవ్ర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. స్పోర్ట్స్‌ బైక్‌పై వెళ్తుండగా.. అది స్కిడ్ కావడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏ మనిషి జీవితంలో అయిన.. సుఖదుఃఖాలు సమానంగా ఉంటాయి. అయితే మనకి తెలిసిన వాళ్లు లేదా బంధువులు సుఖంలో ఉన్నప్పుడు వాళ్లుతో కలిసి ఉంటూ.. కష్టంలో ఉన్నప్పుడు వాళ్లని వదిలేసేవాళ్లు చాలా మందే ఉంటారు ఈ ప్రపంచంలో. కానీ, కొందరు మాత్రం తమకు సంబంధం లేని వాళ్లు కష్టాల్లో ఉన్నా కూడా చూస్తూ ఊరుకోరు. తమకు తోచిన సహాయం చేసి వాళ్లని ఆదుకొనే ప్రయత్నం చేసి.. తమ మానవత్వాన్ని చాటుకుంటారు. అలా తోటి వారికి సహాయం చేయడంలో మన తెలుగు హీరోలు ఎప్పుడూ ముందు ఉంటారు. సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున తదితర సీనియర్ హీరోలతో పాటు యువ హీరోలు కూడా సహాయం చేయడంలో ఎప్పుడు వెనుకాడరు. అలా తోటి మనుషులకు సహాయం చేసే యువ హీరోలలో సాయి ధరమ్ తేజ్ ఒకరు. గతంలో సాయి ధరమ్ తేజ్ ఎంతో మందికి సహాయం చేశారు. కరోనా లాక్‌డౌన్ సమయంలో కూడా ఆయన ఎందరికో చేయూతనిచ్చారు.

అయితే శుక్రవారం ఆయనకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐకియా-కేబుల్‌బ్రిడ్జ్ దాటిన త‌ర్వాత మైండ్‌స్పేస్ జంక్ష‌న్ ప్రాంతంలో సాయితేజ్ ప్ర‌యాణిస్తున్న బైక్ స్కిడ్ అయ్యింది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. అయితే వెంటనే అక్కడ ఉన్న వాళ్లు స్పందించి.. ఆయనను ముందుగా మెడికవర్ ఆస్పత్రికి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే ఇంత పెద్ద ప్రమాదం నుంచి సాయి ధరమ్ తేజ్ బయటపడేందుకు గతంలో ఆయన చేసిన సేవా కార్యక్రమాల వల్ల వచ్చిన పుణ్యమే కారణం అంటూ అభిమానులు అంటున్నారు. ఏడాది క్రితం జూబ్లీహిల్స్ నుంచి తన కారులో వెళుతున్న వేళలో.. రోడ్డు ప్రమాదానికి గురైన ఓ వ్యక్తిని సాయి అక్కడి నిజాంపేట ఉద్యోగరీత్యా స్కూటర్ పై వెళుతున్న ఎల్లారెడ్డిగూడ  కు చెందిన అబ్దుల్,  ట్రాఫిక్ పోలీస్ సహాయంతో ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఫిలిమ్‌నగర్‌లో స్పృహకోల్పోయిన ఓ బిచ్చగాడిని నీళ్లు జల్లి లేపి అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇలా ఎంతో మందికి మంచి చేసిన పుణ్యమే సాయి ధరమ్ తేజ్‌ను కాపాడింది అంటూ అభిమానులు అంటున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని వాళ్లు ప్రార్థనలు చేస్తున్నారు.

 

Tags :