సమ్మర్ హీట్ స్టార్ట్ అయింది

టాలీవుడ్‌లో సినిమాలకు బెస్ట్ సీజన్ అంటే సమ్మర్‌నే. స్టూడెంట్స్‌కి ఈ టైమ్ లో సెలవులుంటాయి కాబట్టి వాళ్లతో పాటు ఫ్యామిలీస్ కూడా థియేటర్లకు పెద్ద ఎత్తున వస్తుంటారు. ఈ సీజన్‌లో రిలీజై, మంచి టాక్ వచ్చిందంటే ఇక ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడం కష్టం. లాంగ్ రన్ కూడా బాగా ఉంటుంది.
నార్మల్ గా ప్రతీ సమ్మర్‌లో టాప్ హీరోలు నటించే భారీ సినిమాలు రిలీజవుతుంటాయి. కానీ ఈ సారి మాత్రం ఒక్క స్టార్ హీరో సినిమా కూడా సమ్మర్ రిలీజ్ కు లేదు. ఈ సమ్మర్ మొత్తం మిడ్ రేంజ్ క్రేజీ మూవీస్ కి పరిమితమైంది. అందులో మొదటి సినిమా దసరా. భారీ అంచనాల మధ్య మార్చి 30న రిలీజ్ అయిన దసరాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే పెద్ద సినిమాలేవీ లేవు అనే లోటు అస్సలు కనిపించట్లేదు.
పెద్ద హీరోల సినిమాలకు పోటీగా దసరా ఓపెనింగ్స్ వచ్చాయి. దసరా సినిమాతో థియేటర్లంతా కళకళలాడిపోతున్నాయి. దసరా థియేటర్లలో చేస్తున్న సందడి చూస్తుంటే టాలీవుడ్‌లో రాబోయే సినిమాలకు హుషారొస్తుంది. సమ్మర్‌లో రానున్న సినిమాలకు ఇది మంచి గుడ్ సైన్. ఈ సినిమా తర్వాత సమ్మర్ మూవీస్ లిస్ట్ లో ఉంది రావణాసుర.
వాల్తేరు వీరయ్య, ధమాకా లాంటి సూపర్ సక్సెస్‌ల తర్వాత మాస్ మహారాజా రవితేజ నుంచి రానున్న సినిమా కావడంతో ఆయన కెరీర్లోనే ఎక్కువ థియేటర్లలో రావణాసురను రిలీజ్ చేయబోతున్నారు. అంతేకాదు ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్‌ట్రా షో లు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఓపెనింగ్స్ పరంగా ఈ సినిమా రవితేజ కెరీర్ బెస్ట్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమా తర్వాత శాకుంతలం, విరూపాక్ష, ఏజెంట్, రామబాణం లాంటి సినిమాలు సమ్మర్ రేసులో ఉన్నాయి.