దేవరలో టాలీవుడ్ యంగ్ హీరో?

వరుస విజయాలతో సూపర్ జోష్ లో ఉన్న ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ తో తన 30వ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. దేవర సినిమాకు సంబంధించిన షూటింగ్ చాలా వేగంగా జరుగుతుంది. ఇప్పటికే మూడు కీలక షెడ్యూల్స్ ను పూర్తి చేసుకున్న దేవర తర్వాతి షెడ్యూల్స్ ను ప్లాన్ చేసుకునే పనిలో ఉంది.
దేవర సినిమా కూడా పాన్ ఇండియా లెవల్‌లో ఐదు భాషల్లో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎంత చిన్న క్యారెక్టర్ అయినా సరే మంచి నటీనటులతోనే చేయించాలని కొరటాల ఫిక్స్ అయ్యాడు. ఇందులో భాగంగానే వేరే ఇండస్ట్రీల నటీనటులను కూడా అరువు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో దేవర గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతుంది.
దేవర సినిమా కోసం టాలీవుడ్ లోని ఓ యంగ్ హీరోను కీలక పాత్ర కోసం సెలెక్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ పాత్ర కథను మలుపు తిప్పుతుందని, అందుకోసం చాలా మంది అనుకున్నప్పటికీ చివరకు తెలగు హీరోనే సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అతని క్యారెక్టరే సినిమాలో పెద్ద సస్పెన్స్ అని అందుకే ఆ హీరో పేరు కూడా లీక్ కాకుండా మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు టాక్. ఇదిలా ఉంటే దేవరలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ సినిమా రిలీజ్ కానుంది.