జో బైడెన్ ఇంట్లో అనుకున్నదానికంటే.. ఎక్కువగా

జో బైడెన్ ఇంట్లో అనుకున్నదానికంటే.. ఎక్కువగా

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు చెందిన డెలావేర్‌లోని విల్మింగ్టన్‌ ఇంట్లో న్యాయవాదులు గతంలో అనుకున్నదానికంటే ఎక్కువగా మరిన్ని రహస్య పత్రాలను గుర్తించారు. శ్వేతసౌధం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. అధ్యక్ష భవన న్యాయవాది రిచర్డ్‌ సౌబర్‌ ఈ మేరకు ఓ ప్రకటన చేశారు.  బైడెన్‌ వ్యక్తిగత గ్రంథాలయ శోధనలో మొత్తం ఆరు పేజీలు అధికారిక రహస్య పత్రాలను గుర్తించినట్లు తెలిపారు. గతంలో ఒక్క పేజీ మాత్రమే అక్కడ కనుగొన్నారు. గత నవంబరు, డిసెంబరు నెలల్లో బైడెన్‌ ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పటి పాత కార్యాలయాలు, గ్యారేజీల నుంచి గుర్తించిన పత్రాలకు తాజాగా దొరికినవి అదనం.

 

 

Tags :