టోర్నడోల బీభత్సంలో అమెరికన్ ల కష్టాలు

టోర్నడోల బీభత్సంలో అమెరికన్ ల కష్టాలు

అమెరికాలో ఐదు రాష్ట్రాల్లో టోర్నడోలు విజృంభణ ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. అనేక మింది మృత్యువాత పడగా, ప్రస్తుతం మిగిలిన ప్రజలు మంచినీరు వంటి కనీస అవసరాలు కూడా తీరక కష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా కెంటకీ రాష్ట్రంలో సమస్య ఇంకా ఎక్కువగా ఉంది. ఈ ఒక్క రాష్ట్రంలో ఇప్పటి వరకూ 64 మంది మృతి చెందారు. అనేక మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. టోర్నడలో బీభత్సంతో విద్యుత్‌ వ్యవస్థ కుప్పకూలింది. విద్యుత్‌ లేకపోవడంతో మంచి నీటి సరఫరాకు కూడా స్థంభించిపోయింది. కొన్ని ప్రాంతాల్లో మంచినీటి టవర్లు కూడా కుప్పకూలిపోయాయి. టోర్నడోలతో అనేక ఇళ్లు ధ్వంసం కావడంతో వందలాది మంది నిరాశ్రయులయ్యారు.  వీరికి ప్రభుత్వ పార్కుల్లో అవాసం కల్పించనున్నట్లు కెంటకీ గవర్నర్‌ అండీ బెషీర్‌ ప్రకటించారు.

రాష్ట్రంలోని మేఫిల్డ్‌ నగరంలో మౌలిక సదుపాయాలు పూర్తిగా కొటుకుని పోయాయని ఆ నగర మేయర్‌ కతీ స్టేవార్ట్‌ ఓ నాన్‌ తెలిపారు. మంచీ నీళ్లు, గ్యాస్‌ సరఫరా వ్యవస్థ కూడా నాశమయిందని తెలిపారు. రాష్ట్రంలో మళ్లీ సాధారణ పరిస్థితి కల్పించడానికి నెలలు కాదు, కొన్ని ఏళ్లు పడుతుందని కెంటికీ రాష్ట్ర ఎమెర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌ మిచ్చెల్‌ డొస్సెట్ట్‌ స్పష్టం చేశారు. మిగిలిన రాష్ట్రాల్లో కూడా పరిస్థితి దాదాపు ఇదే విధంగా ఉంది. ఈ ఐదు రాష్ట్రాల్లో మృతుల సంఖ్యపై ఇంకా అధికారులు సృష్టతకు రాలేదంటూ పరిస్థితిని అర్థం చేసుకొవచ్చు.

 

Tags :