అధికారంలోకి వచ్చాక... వారిని పట్టించుకోవడం లేదు : రేవంత్ రెడ్డి

అధికారంలోకి వచ్చాక... వారిని పట్టించుకోవడం లేదు : రేవంత్ రెడ్డి

పోడుభూముల సమస్యను పరిష్కరిస్తామన్న కేసీఆర్‌ అధికారంలోకి వచ్చాక వారిని పట్టించుకోవడం లేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ సభ్యుడు కాంతారావు తదితరులు రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేశారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ పోడు భూముల్లో దుక్కి దున్ని సాగు చేసుకుంటున్నవారిని పోలీసులు అరెస్టు చేసి హింసించారన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆదివాసీలను చిన్నచూపు చూస్తోందని పేర్కొన్నారు. 11 నెలల్లో ఎన్నికలు వస్తాయని, కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని రేవంత్‌ ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం 10 స్థానాలను కాంగ్రెస్‌ గెలుచుకుంటుందన్నారు. తాటి వెంకటేశ్వర్లు, కాంతారావుల చేరికతో కాంగ్రెస్‌ మరింత బలపడుతుంది. రైతు డిక్లరేషన్‌ అమలైతే రైతుల జీవితాలే మారిపోతాయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పోవాలి. పేదల ప్రభుత్వం రావాలన్నారు.  త్వరలోనే అశ్వరావుపేటలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం. త్వరలో కాంగ్రెస్‌లో చేరికల తుపాన్‌ రాబోతోంది అని అన్నారు.

 

Tags :