చికాగోలో వార్షిక చెస్ టోర్నమెంట్ విజయవంతం

చికాగోలో వార్షిక చెస్ టోర్నమెంట్ విజయవంతం

ట్రైస్టేట్‌ తెలుగు అసోసియేషన్‌, తానా చికాగో ఛాప్టర్‌ ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 18న చికాగోలో వార్షిక చెస్‌ టోర్నమెంట్‌ నిర్వహించారు. ఈ పోటీలలో పిల్లలు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రజ్ఞా పాఠవాల్ని ప్రదర్శించారు. పిల్లలలోని నిర్ణయాత్మక శక్తి, విశ్లేషణ నైపుణ్యం, ఏకాగ్రతని పెంచే చదరంగ పోటీలను టిటిఎ, తానాప్రతి సంవత్సరం  నిర్వహించడాన్ని పిల్లల తల్లితండ్రులు అభినందించారు. టిటిఎ ప్రెసిడెంట్‌ హేమచంద్ర వీరపల్లి ఆధ్వర్యంలో చెస్‌ పోటీలు విజయవంతంగా నిర్వహించగా తానా సభ్యులు రవి వేమూరి, రామకృష్ణ కొర్రపోలు, ప్రసాద్‌ మరువాడ, దిలీప్‌ రాయపూడి, హేమంత్‌ పప్పు, మధు ఆరంబాకం సహకరించారు. ఈ కార్యక్రమానికి తానా ప్రెసిడెంట్‌ అంజయ్య చౌదరి లావు, స్పోర్ట్స్‌ కోఆర్డినేటర్‌ శశాంక్‌ యార్లగడ్డ వీడియో కాన్ఫరెన్స్‌ లో పాల్గొని విజేతలను అభినందించారు.

తానా మిడ్‌ వెస్ట్‌ రీజినల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ హను చెరుకూరి ఆధ్వర్యంలో తానా లీడర్లు యుగంధర్‌ యడ్లపాటి, కృష్ణ మోహన్‌ చిలంకూరు, రవి కాకర, చిరంజీవి గల్లా, సందీప్‌ ఎల్లంపల్లి, హేమ కానూరు తదితరులు పిల్లలను ప్రోత్సహించారు.

 

Tags :
ii). Please add in the header part of the home page.