టీటీఏ చికాగో ఆధ్వర్యంలో ‘స్పెల్లింగ్ అండ్ మ్యాథ్ బీ’ పోటీలకు సర్వం సిద్ధం

టీటీఏ చికాగో ఆధ్వర్యంలో ‘స్పెల్లింగ్ అండ్ మ్యాథ్ బీ’ పోటీలకు సర్వం సిద్ధం

‘తెలుగు మాట్లాడండి-తెలుగు మాట్లాడించండి’ అనే నినాదంతో పని చేసే ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) మరో కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తోంది. టీటీఏ చికాగో ఆధ్వర్యంలో ‘స్పెల్లింగ్ అండ్ మ్యాథ్ బీ’ చికాగో ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించేందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సంస్థలో సభ్యులు ఈ కార్యక్రమంలో ఉచితంగా పాల్గొనవచ్చు. అదే సభ్యులు కాని వారు మాత్రం పోటీలో పాల్గొనేందుకు 10 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబరు 3 శనివారం నాడు ఈ కార్యక్రమం జరుగుతుంది. బ్లూమింగ్‌డేల్‌ పబ్లిక్ లైబ్రరీలో ఈ పోటీ నిర్వహించనున్నారు. శనివారం ఉదయం 9.30 నుంచి 11.30 వరకు మ్యాథ్ బీ పోటీలు జరుగుతాయి. ఆ తర్వాత గంటసేపు లంచ్ ఉంటుంది. మళ్లీ మధ్యాహ్నం 12.30 నుంచి 3.30 వరకు స్పెల్లింగ్ బీ పోటీలు జరుగుతాయి. ఈ పోటీలను జేఎస్‌బీ (జూనియర్ స్పెల్లింగ్ బీ), ఎస్ఎస్‌బీ (సీనియర్ స్పెల్లింగ్ బీ), ఎంబీ1 (మ్యాథ్ బీ లెవెల్ 1), ఎంబీ2 (మ్యాథ్ బీ లెవెల్ 2) స్థాయుల్లో నిర్వహిస్తున్నట్లు టీటీఏ చికాగో తెలిపింది.

 

Tags :