సీఎం వైఎస్ జగన్ ను కలిసిన గిరిజన ఎమ్మెల్యేలు

సీఎం వైఎస్ జగన్ ను కలిసిన గిరిజన ఎమ్మెల్యేలు

గిరిజన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు, స్థానిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, గిరిజన ఎమ్మెల్యేలు పీడిక రాజన్న దొర, తెల్లం బాలరాజు, విశ్వసరాయి కళావతి తదితరులు శాసనసభ లోని కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోమన్‌ రెడ్డిని కలిశారు. దీనిపై స్పందించిన సీఎం జగన్‌ గిరిజన ప్రాంతాల అభివృద్ధికి అవసరమైన అన్ని చ్యలు తీసుకోవాలని సీఎంవో అధికారులను ఆదేశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి సంబంధించిన అంశాలు, కరోనా సమయంలో ఆగిపోయిన రోడ్ల నిర్మాణం, ఎత్తన కొండ ప్రాంతాల్లో నిర్మిస్తున్న రహదారులను మెషిన్స్‌ ద్వారా చేయడానికి అవసరమైన అనుమతులు, కొండ ప్రాంతాల్లోకి వెళ్లేందుకు అవసరమైన రైస్‌ వ్యాన్స్‌, మెరుగైన ఇంటర్నెట్‌ సౌకర్యం వంటి అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

ఆదేవిధంగా జీవో నవంబర్‌ 3 పై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. షెడ్యూల్డ్‌ ఏరియాలో చేర్చని గ్రామాలను కూడా చేర్చడం ద్వారా రానున్న అసెంబ్లీ సమావేశాలలో తీర్మానం చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. కాగా గిరిజన ప్రాంతాల్లోని సమస్యలన్నింటిని వెంటనే పరిష్కరించాలని జగన్‌ అధికారులను ఆదేశించారు.

 

Tags :