ఫ్రిస్కో నగరంలో శ్రీశ్రీకి నివాళులు

ఫ్రిస్కో నగరంలో శ్రీశ్రీకి నివాళులు

టెక్సాస్‌లోని ఫ్రిస్కో నగరంలో మహాకవి శ్రీశ్రీకి నివాళులు అర్పించారు. డాక్టర్‌ ప్రసాద్‌ తోటకూర అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అనేక మంది ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. మహాప్రస్థానంలోని 40 కవితలను చదివి వినిపించారు. తోటకూర ప్రసాద్‌ మాట్లాడుతూ... శ్రీశ్రీ జీవితంలోని కొన్ని ముఖ్య సంఘటనలను, ఆయన కలంనుండి వెలువడ్డ వివిధ రచనలలోని ముఖ్య అంశాలను వివరించారు. 

ఈ ప్రత్యేక సాహిత్య సమావేశంలో అనంత్‌ మల్లవరపు, ఎంవీఎల్‌ ప్రసాద్‌, అరుణజ్యోతి కోల, రాజశేఖర్‌ సూరిభొట్ల, రావు కల్వల, విశ్వనాధం పులిగండ్ల, డాక్టర్‌ నక్త రాజు, రమణ జువ్వాడి, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ,  కిరణ్మయి గుంట, శ్రీధర్‌ రెడ్డి కొర్సపాటి, శ్రీనివాసరెడ్డి ఆళ్ళ, భాస్కర్‌ రాయవరం, శారద సింగిరెడ్డి, మురళి వెన్నం, నరసింహారెడ్డి ఊరిమిండి, లెనిన్‌ వేముల, చంద్రహాస్‌ మద్దుకూరి, చినసత్యం వీర్నపు, రాజేశ్వరి ఉదయగిరి, జగదీశ్వరన్‌ పుదూర్‌, దయాకర్‌ మాడ తదితరులు పాల్గొన్నారు.

 

Tags :