భవానీపూర్ బరిలో మమత

భవానీపూర్ బరిలో మమత

పశ్చిమబెంగాల్‍ రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరపనున్నట్లు ఎన్నికల కమిషన్‍ ప్రకటించింది. పశ్చిమబెంగాల్‍లో మూడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల నేపథ్యంలో తృణమూల్‍ కాంగ్రెస్‍ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ముందుగా ఊహించనట్టుగానే ముఖ్యమంత్రి మమత బెనర్జీ భవానీపూర్‍ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. జంగీపూర్‍లో జాకీ హుస్సేన్‍, షంషేర్‍ గంజ్‍లో అమీరుల్‍ ఇస్లాం తృణమూల్‍ తరపున బరిలో ఉన్నారు. ఈ నెల 30న ఈ మూడు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. సెప్టెంబర్‍ 30న ఉప ఎన్నికలు నిర్వహించనుండగా, అక్టోబర్‍ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.         

 

Tags :