మరోసారి థమన్‌పై ట్రోలింగ్స్

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న థమన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. రీసెంట్‌గా వాల్తేరు వీరయ్య సినిమాతో దేవీ శ్రీ కంబ్యాక్ ఇచ్చినా సరే, సినిమాల కౌంట్ ప్రకారం చూసుకుంటే దేవీ కంటే థమన్ చేతిలోనే ఎక్కువ సినిమాలున్నాయి. పుష్ప2 తప్ప దేవీ చేతిలో పెద్ద సినిమాలేమీ లేవు. థమన్ స్పీడు, జోష్, ట్రాక్ రికార్డు ఎంత గొప్పగా ఉన్నా సరే, ఎప్పుడూ ఏదొక రీజన్‌తో సోషల్ మీడియాలో టార్గెట్ అవుతూనే ఉంటాడు. కాపీ ట్యూన్లు అని ఒకసారి, హీరోలను ఆకాశానికెత్తడం పేరుతో మరోసారి ఇలా రీజన్ ఏదైతే ఏంటి ఏదో రకంగా యాంటీ ఫ్యాన్స్ థమన్ ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు.
రీసెంట్‌గా థమన్, రామ్ చరణ్ 15వ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా చాలా స్పెషల్‌గా ఉంటుందని, శంకర్ కోసం స్పెషల్ సౌండ్ ఇచ్చానని చెప్పాడు. మహేష్ బాబు 28వ సినిమా గురించి మాట్లాడుతూ అతడు సినిమా నుంచి త్రివిక్రమ్‌ను ఫాలో అవుతున్న తనకు ఈసినిమా డ్రీమ్ కాంబో అని ఈ సినిమాలో తన నుంచి బెస్ట్ వర్క్ చూస్తారని హామీ ఇచ్చాడు. ఇక రీసెంట్‌గా విజయ్ వారసుడు సినిమా టైమ్‌లో ఓ రేంజ్ లో విజయ్ ను ఆకాశానికెత్తేశాడు.
వీరసింహా రెడ్డి సక్సెస్ మీట్లో తాను బాలయ్యకు లైఫ్ టైమ్ ఫ్యాన్ అని చెప్పుకున్నాడు. గతంలో ప్రభాస్, వెంకటేష్, బన్నీ, చిరూ అందరికీ ఇలాగే డప్పు కొట్టిన సందర్భాలున్నాయి. ఇప్పుడు ఆ వీడియోలన్నీ బయటకు తీసుకొచ్చి వాటిని కలుపుతూ ఇంతకూ థమన్ ఎవరి ఫ్యాన్ అంటూ ట్రోల్ చేయడం మొదలెట్టారు. థమన్ ఎవరిని ఇష్టపడతాడు? ఎవరికి ఫ్యానిజం చేస్తాడనేది పక్కన పెడితే స్టార్ హీరోలతో పని చేస్తున్నప్పుడు టెక్నీషియన్లు ఇలా వాళ్లకు డప్పు కొట్టడమనేది చాలా సహజమైన విషయం.