స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు!

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు!

తెలంగాణ రాష్ట్రంలో 12 స్థానిక సంస్థల నియోజకవర్గాలకు టీఆర్‌ఎస్‌ తమ అభ్యర్థులను ఖరారు చేసినట్టు తెలిసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే పలు దఫాలుగా చర్చించారు. అధికారికంగా రేపో, మపో  ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం. బాను ప్రసాద్‌, ఎల్‌ రమణ (కరీంనగర్‌), శాంభీపూర్‌ రాజు, పట్నం మహేందర్‌ రెడ్డి (రంగారెడ్డి), కసిరెడ్డి నారాయణ రెడ్డి, సాయి చంద్‌ (మహబూబ్‌నగర్‌), పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి ( వరంగల్‌), దండే విఠల్‌ (ఆదిలాబాద్‌),  ఎంసీ కోటిరెడ్డి (నల్లగొండ), ఆకుల లలిత ( నిజామాబాద్‌), తాత మధు (ఖమ్మం), డాక్టర్‌ యాదవరెడ్డి (మెదక్‌) నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్లు సమాచారం.

 

Tags :