టీఆర్ఎస్ ఎమ్మెల్యే హత్యకు కుట్ర!

టీఆర్ఎస్ ఎమ్మెల్యే హత్యకు కుట్ర!

టీఆర్‌ఎస్‌కు చెందిన ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై హత్యకు కుట్ర జరిగింది. బంజారాహిల్స్‌ రోడ్‌ నం-12 వేమూరి ఎన్‌క్లేవ్‌లోని ఆయన నివాసం వద్ద కల్లెడ గ్రామానికి చెందిన సర్పంచ్‌ భర్త ప్రసాద్‌గౌడ్‌ ఈ హత్యకు కుట్రపన్నారు. జీవన్‌ రెడ్డి ఇంటి వద్ద ఆయుధాలతో అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో ఎమ్మెల్యే సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో బంజారాహిల్స్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అక్కడికి చేరుకుని ప్రసాద్‌ గౌడ్‌ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతడి వద్ద  కత్తి,  తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన భార్యను సర్పంచ్‌ పదవి నుంచి సప్పెండ్‌ చేసే విషయంలో ఎమ్మెల్యేపై ప్రసాద్‌గౌడ్‌ కక్ష పెంచుకున్నట్లు సమాచారం.

 

Tags :