ఆయన ఎక్కడ సభ పెట్టినా.. అక్కడ ఔట్

ఆయన ఎక్కడ సభ పెట్టినా.. అక్కడ ఔట్

రాహుల్‌ గాంధీ ఐరన్‌ లెగ్‌ ఆయన ఎక్కడ సభ పెట్టినా అక్కడ కాంగ్రెస్‌ పార్టీ ఔట్‌ అని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌ ఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ అంటే ఇండియన్‌ నేషనల్‌ క్లబ్‌ పార్టీ అని ధ్వజమెత్తారు.   కాంగ్రెస్‌ పార్టీది రైతు సంఘర్షణ సభ కాదు, అది కాంగ్రెస్‌ కొట్లాట సభ అని విమర్శించారు. ఆయన రాహుల్‌ గాంధీ కాదు, రాజరికపు గాంధీ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ డిక్లరేషన్‌ కాదు, ఫ్రస్టేషన్‌ అని దుయ్యబట్టారు. ఢల్లీి వాసి రాహుల్‌ గల్లీ సన్నాసి రేవంత్‌ను ఏం మాట్లాడాలని అడుగుతున్నారని విమర్శించారు. రాహుల్‌ ఏ హోదాలో తెలంగాణకు వచ్చాడు. ఆయన ఏమైనా కాంగ్రెస్‌ అధ్యక్షుడా? అని ప్రశ్నించారు. రాహుల్‌ ఎలా డిక్లరేషన్‌ ప్రకటిస్తాడని నిలదీశారు. రాష్ట్రానికి అనేక మంది పొలిటికల్‌ టూరిస్టులు వస్తున్నారు. అలాంటి వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. కేసీఆర్‌ పోరాటం వల్లే తెలంగాణ వచ్చిందన్నారు.

 

Tags :