పార్లమెంట్ శీతాకాల సమావేశాలను బహిష్కరించిన టీఆర్ఎస్

పార్లమెంట్ శీతాకాల సమావేశాలను బహిష్కరించిన టీఆర్ఎస్

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలను టీఆర్‌ఎస్‌ ఎంపీలు బహిష్కరించారు. లోక్‌సభకు 9 మంది, రాజ్యసభ సమావేశాలకు ఏడుగురు ఎంపీలు దూరంగా ఉంటారని ఆ పార్టీ వెల్లడించింది. ధాన్యం కొనుగోళ్ల అంశంలో కేంద్రం వైఖరిని నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ధాన్యం కొనుగోళ్ల అంశంలో టీఆర్‌ఎస్‌ ఎంపీలు లోక్‌సభ, రాజ్యసభల్లో ఆందోళనలు చేపట్టారు. ధాన్యం, బియ్యం ఎంత సేకరిస్తారో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. ధాన్యం సేకరణకు సమగ్ర జాతీయ విధానం తేవాలని, మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం సభ వెలుపలా ప్లకార్డులతో నిరసన తెలిపారు. తాము నిరసన తెలుపుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పార్టీమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్ల అంశంపై కేంద్రం వైఖరిని చెప్పకపోవడం బాధాకరమన్నారు.

 

Tags :