25న టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక

25న టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక

ఈ నెల 25న టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించనున్నట్లు ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రెండేళ్లకొసారి పార్టీ అధ్యక్షుడి ఎన్నిక నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎన్నికల షెడ్యూల్‌ను 17న విడుదల చేస్తామని ప్రకటించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ  ఈ నెల 17 నుంచి 22 వరకు నామినేషన్లు స్వీకరణ ఉంటుందన్నారు. 23న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 24న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ చేపడతామని తెలిపారు. 25న జనరల్‌ బాడీ మీటింగ్‌లో అధ్యక్షుడిని ఎన్నుకుంటామన్నారు. రిటర్నింగ్‌ ఆఫీసర్‌గా ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌ రెడ్డి వ్యవహరించనున్నారు. 25న అధ్యక్ష ఎన్నిక ముగిసిన అనంతరం పార్టీ ఫ్లీనరీ సమావేశం కొనసాగనుంది. రాష్ట్ర స్థాయి అంశాలతో పాటు ఇతర అంశాలపై విస్తృతమైన చర్చ కొనసాగనుంది. తీర్మానాల కమిటీ చైర్మన్‌గా సిరికొండ మధుసూదనచారి వ్యవహరిస్తారు అని కేటీఆర్‌ తెలిపారు. 

 

Tags :