మార్గరేట్ అల్వాకు టీఆర్ఎస్ మద్దతు

మార్గరేట్ అల్వాకు టీఆర్ఎస్ మద్దతు

విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరేట్‌ అల్వా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అల్వాకు తాము మద్దతు ఇస్తున్నట్లు టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రకటించింది. మార్గరేట్‌ అల్వాకు మద్దతునివ్వాలని టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత ముఖ్యమంత్రి  కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ నిర్ణయం మేరకు మొత్తం 16 మంది టీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీలు మార్గరెట్‌ అల్వాకు ఓటు వేయనున్నారు. పార్టీ అధ్యక్షులు కేసీఆర్‌ ఆదేశాల మేరకు టీఆర్‌ఎస్‌ పార్టీ పార్లమెంటరీ నేత కె కేశవరావు తెలిపారు. పార్లమెంట్‌ భవనంలో ఉపరాష్ట్రపతి ఎన్నిక, ఓట్ల లెక్కింపు జరగనుంది. రహస్య బ్యాలెట్‌ విధానంలో నిర్వహించనున్న ఈ ఎన్నికల్లో మొత్తం 788 మంది ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

 

Tags :