ఆ నిందను మరో దేశంపై : జాన్ కెల్లీ

ఆ నిందను మరో దేశంపై : జాన్ కెల్లీ

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అణుయుద్దానికి తహతహలాడిపోయేవారని, ముఖ్యంగా ఉత్తర కొరియాపై ఆయన అణుబాంబు ప్రయోగించాలని ఉవ్విళ్లూరారని వైట్‌హౌస్‌ అప్పటి చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ జాన్‌ కెల్లీ వెల్లడించారు. ఉత్తరకొరియాపై అణుబాంబు వేసి, నిందను మరోదేశం పైకి నెట్టేయాలని కూడా చూశారని, అయితే ఆయనను ఆపలేక తాము నానా తిప్పలు పడ్డామని కెల్లీ వివరించారు. ఉత్తర కొరియాపై  అణుబాంబు వేయాలని, ఆ నింధనను మరోదేశంపై నెట్టేద్దామని  2017లో జరిగిన క్లోజ్డ్‌ డోర్‌ మీటింగ్‌లో ట్రంప్‌ అన్నారు. అయితే ఇది సరికాదని, విషయాన్ని దాచడం సాధ్యం కాదని మేం నచ్చజెప్పేందుకు నానా తంటాలు పడ్డాం అని కెల్లీ వివరించారు.

 

 

Tags :