అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు షాక్.. రోజుకు పదివేల డాలర్ లు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు షాక్.. రోజుకు పదివేల డాలర్ లు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రోజుకు పదివేల డాలర్లు జరిమానా చెల్లించాలని న్యూయార్క్‌ జడ్జి ఒకరు ఆదేశించారు. ఆయన హాజరు కావాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించడంతో పాటు తన వ్యాపార పద్ధతులకు సంబంధించిన పరతాలను కోర్టుకు సమర్పించే వరకూ ఈ జరిమానాను చెల్లించాలని ఆదేశించారు. దీనితో ఒకేరోజే ఆయన పదివేల డాలర్లు బాకీ పడ్డారు.  రానురాను రోజుకు పదివేల డాలర్ల వంతున మొత్తం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక లబ్దికోసం తన ఆస్తులను తప్పుడు విధానంలో విలువ కట్టినట్లు వచ్చిన ఆరోపణలపై 2019లో దర్యాప్తు ప్రారంభించారు.  ట్రంప్‌ అనుసరించిన పద్ధతులకు సంబంధించిన పత్రాలు అందించాలని న్యూయార్క్‌ అటార్నీ జనరల్‌ కార్యాలయం ఆదేశించింది.

 

Tags :