తాను అధ్యక్షుడిగా ఉంటే.. ఇలా జరిగేది కాదు

తాను అధ్యక్షుడిగా ఉంటే.. ఇలా జరిగేది కాదు

బ్రిటన్‌ దివంగత రాణి ఎలిజబెత్‌-2 అంత్యక్రియలకు హాజరైన అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ వెనుక వరుసలో కూర్చోవడంపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆక్షేపించారు. తాను అధ్యక్షుడిగా ఉంటే ఇలా జరిగేది కాదన్నారు. లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ అబేలో రాణి అంతిమసంస్కారంలో భాగంగా ఎలిజబెత్‌ పార్థివ దేహాన్ని ఉంచి ప్రత్యే ప్రార్థనలు జరిపారు. అనంతరం వివిధ దేశాల నుంచి హాజరైన 500 మంది దేశాధినేతలతో పాటు 2 వేల మంది అతిథులు రాణికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బైడెన్‌, ఆయన సతీమణికి 14వ వరుసలో సీట్లు కేటాయించారు. ఇది వెనుక వైపు నుంచి ఏడో వరసు. దీంతో బైడెన్‌పై ట్రంప్‌ వ్యంగాస్త్రాలు గుప్పించారు.

జో బైడెన్‌ ఫోటోను తన ట్రూత్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ట్రంప్‌.. కేవలం రెండేళ్లలోనే అమెరికా పరిస్థితి ఎలా మారిందో చూడండి. ప్రపంచ వేదికపై అమెరికాకు గౌరవం దక్కట్లేదు. ఒకవేళ నేను అధ్యక్షుడిగా ఉంటే వారు నన్ను ఇలా వెనుక వరుసల్లో కూర్చోబెట్టేవారు కాదు. మనదేశం కూడా ఇప్పుడున్న దానికంటే చాలా భిన్నంగా ఉండేది. రియల్‌ ఎస్టేట్‌ అయినా రాజకీయాలైనా జీవితమైనా లొకేషన్‌ చాలా ముఖ్యం అని బైడెన్‌ను విమర్శించారు.

 

Tags :