MKOne TeluguTimes-Youtube-Channel

ఫేస్ బుక్, యూట్యూబ్ లోకి డొనాల్డ్ ట్రంప్ రీ ఎంట్రీ

ఫేస్ బుక్, యూట్యూబ్ లోకి డొనాల్డ్ ట్రంప్ రీ ఎంట్రీ

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. 2024 అధ్యక్ష ఎన్నికలకు కొన్ని నెలల ముందు ట్రంప్‌ ప్రముఖ సోషల్‌ మీడియాల్లోకి పునరాగమనం చేయడం ప్రాధాన్యం సతరించుకుంది. అమెరికా క్యాపిటల్‌  భవనంపై దాడి అనంతరం ఆయన సోషల్‌ మీడియా ఖాతాలపై విధించిన నిషేధం ఎత్తివేసిన నేపథ్యంలో ఐ యామ్‌ బ్యాంక్‌ అంటూ ఫేస్‌బుక్‌,యూట్యూబ్‌ వేదికలపై అభిమానులను పలకరించారు.  2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించిన ట్రంప్‌నకు ఫేస్‌బుక్‌లో దాదాపు 34 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.  యూట్యూబ్‌లో సైతం 2.6 మిలియన్‌ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

 

 

Tags :