నవంబరు 15న కీలక ప్రకటన : ట్రంప్

నవంబరు 15న కీలక ప్రకటన : ట్రంప్

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారా? దీనిపై మరికొద్ది రోజుల్లో ఆయన స్పష్టతనిచ్చే అవకాశముంది. వచ్చే వారం తానో కీలక ప్రకటన చేస్తారని ట్రంప్‌ స్వయంగా వెల్లడించారు. అమెరికా మధ్యంతర ఎన్నికల ప్రచారం నిమిత్తం ట్రంప్‌  ఒహైయోలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబరు 15న ఫ్లోరిడాలో నేను చాలా పెద్ద ప్రకటన చేయబోతున్నా అని తెలిపారు. మూడోసారి అధ్యక్ష ఎన్నికల్లో  పోటీపై ట్రంప్‌ ఆసక్తిగా ఉన్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. అయితే దీనిపై ఆయన స్పష్టతనివ్వట్లేదు. తాజాగా కీలక ప్రకటన చేయబోతున్నాని చెప్పడంతో, ట్రంప్‌ అధ్యక్ష ఎన్నికల ప్రచారం ప్రారంభించే అవకాశముందని ప్రచారం జరుగుతుంది.

 

Tags :
ii). Please add in the header part of the home page.