తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లుగా స్రీ, శిశు సంక్షేమ శాఖలో భాగంగా ఉన్న దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్‌జెండర్ల సంక్షేమ శాఖ విభాగాన్ని ప్రత్యేక మంత్రిత్వ శాఖగా ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.  దివ్యాంగుల సంక్షేమంపై మరింత దృష్టి సారించేందుకు వీలుగా ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలన్న విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.  దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్‌జెండర్లకు సంక్షేమం, సమర్థ సేవలు అందించేందుకు వీలుగా జిల్లా స్థాయిలోనూ మహిళ, శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేశారు. దీనికి జిల్లా సంక్షేమ అధికారిని నియమిస్తారు. మహిళ శిశు సంక్షేమం, దివ్యాంగుల సంక్షేమ శాఖల మధ్య ప్రతి జిల్లాకు శాఖపరమైన ఏర్పాట్లు చేయనున్నారు. 

 

 

Tags :