టీ సర్కార్ డబుల్ గుడ్ న్యూస్.. ఒకటి ఉద్యోగులకి, ఇంకోటి టీచర్లకి..

టీ సర్కార్ డబుల్ గుడ్ న్యూస్.. ఒకటి ఉద్యోగులకి, ఇంకోటి టీచర్లకి..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ డీఏ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. ఉద్యోగులకు 2.73 శాతం డీఏ మంజూరు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 2021 జులై 1 నుంచి డీఏ చెల్లించనున్నట్లు సర్కారు పేర్కొంది. 2021 జులై నుంచి 2022 డిసెంబరు వరకు ఉన్న డీఏ బకాయిలను మొత్తం 8 విడతల్లో చెల్లించనున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ డీఏ జనవరి పింఛన్‌తో కలిపి ఫిబ్రవరి వేతనంలో చెల్లించనున్నట్లు వెల్లడించింది. 

మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించి తాజా షెడ్యూల్‌‌ను విడుదల చేసింది. ఈ నెల 27వ తేదీ నుంచి పదోన్నతులు, బదిలీల ప్రక్రియను ప్రారంభించబోతున్నట్లు అందులో వెల్లడించింది. దీనికి సంబంధించి ఈ నెల 28 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొంది. మార్చి 4వ తేదీ నాటికి ప్రక్రియ పూర్తిచేసి 5 నుంచి 19 వరకు అప్పీళ్లకు అవకాశం కల్పించాలనే ఆలోచనలో కేసీఆర్ సర్కార్ ఉన్నట్లు సమాచారం. టీచర్ల నుంచి దరఖాస్తులు అందిన 15 రోజుల్లో అప్పీళ్లను పరిష్కరించి బదిలీలు, పదోన్నతులకు మార్గం సుగమం చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

 

Tags :