టిటిఎ ఆధ్వర్యంలో బే ఏరియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

టిటిఎ ఆధ్వర్యంలో బే ఏరియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (టిటిఎ) 2015లో ప్రారంభమైనప్పటి నుండి అసోసియేషన్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ పైళ్ల మల్లా రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్‌ విజయపాల్‌ రెడ్డి, డాక్టర్‌ హరనాథ్‌ పోలిచెర్ల, అధ్యక్షుడు డాక్టర్‌ మోహన్‌ పాటలోళ్ల, టీటిఎ ప్రస్తుత కార్యనిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో అనేక సాంస్క ృతిక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోంది. 2021లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల విస్తరణలో భాగంగా తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ బే ఏరియా ఆధ్వర్యంలో, చాప్టర్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ గ్లోబ్‌ సిలికాన్‌ వ్యాలీ సహకారంతో డా. రోమేష్‌ జాప్రా, రాజేష్‌ వర్మ, మహేష్‌ పాకాల సహకారంతో ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా - దీపావళి వేడుకల్లో భాగంగా  ఫ్రీమాంట్‌లో అతిపెద్ద బతుకమ్మ వేడుకను జరిపారు. 3000 మందికి పైగా ప్రజలు ఈ వేడుకకు హాజరయ్యారు, ఇక్కడ పూర్తిగా టీకాలు వేసిన వారిని మాత్రమే అనుమతించారు.

ఈ కార్యక్రమానికి అసెంబ్లీ సభ్యులు, నగర మేయర్లు, పోలీసు కమిషనర్లు మరియు ఫ్రీమాంట్‌ సిటీ అధికారులతోపాటు ఇతర ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. భారత కాన్సుల్‌ జనరల్‌, శాన్‌ ఫ్రాన్సిస్కో ముఖ్య అతిథి అంబాసిడర్‌ డా. నాగేంద్ర ప్రసాద్‌ బ్రహ్మాండమైన ఈ కార్యక్రమానికి హాజరయ్యారు, యుఎస్‌ఎ చరిత్రలో ఏ సంస్థ చేసిన అతిపెద్ద బతుకమ్మ పండుగను పూర్తిగా ఆస్వాదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఈ పవిత్రమైన నవరాత్రి మరియు బతుకమ్మ పండుగలో నిజమైన తెలంగాణ సంస్కృతిని చిత్రీకరించినందుకు నిర్వాహకులందరినీ, తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ బే ఏరియా చాప్టర్‌ని ఆశీర్వదించారు. జిల్లా 25వ కాలిఫోర్నియా అసెంబ్లీ సభ్యుడు శ్రీ అలెక్స్‌ లీ కూడా మాట్లాడారు. తెలంగాణ సంస్కృతి మరియు వారసత్వాన్ని, తదుపరి తరాలకు కమ్యూనిటీ సర్వీస్‌ పార్టిసిపేషన్‌ ద్వారా అందించడం కోసం తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ చేస్తున్న సేవను అభినందిస్తూ, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఎందరో ప్రముఖులు ఫ్రీమాంట్‌ మేయర్‌ శ్రీమతి లిల్లీ మీ, నగర కౌన్సిల్‌ సభ్యులు తెరాస కెంగ్‌, రాజ్‌ సల్వాన్‌ తదితరులు కూడా తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ చేస్తున్న సేవా కార్యక్రమాలను, వేడుకలను ప్రశంసించారు. డా. రోమేష్‌ జప్రా, ఛైర్మన్‌, ఎఫ్‌ఐఎ, రాజేష్‌ వర్మ, ప్రెసిడెంట్‌ ఎఫ్‌ఐఎ, మహేష్‌ పాకాల, ఎఫ్‌ఓజి, కూడా బే ఏరియా టిటిఎ టీమ్‌ చేసిన ఏర్పాట్లను అభినందించారు. 

టిటిఎ ప్రధాన కార్యదర్శి, గవర్నర్‌ కార్యాలయం నుంచి సాంస్కృతిక రాయబారిగా గుర్తింపు పొందిన శ్రీనివాస మనప్రగడ మాట్లాడుతూ, టిటిఎ ప్రారంభమైనప్పటి నుండి నేటి వరకు ఎఫ్‌ఓజి, ఇతర సంస్థలతో కలిసి బే ఏరియాలో వివిధ కార్యక్రమాలను చేస్తోందని, తెలంగాణ సంస్క ృతి, వారసత్వం మరియు సాంప్రదాయాన్ని విస్తరించేందుకు కృషి చేస్తోందన్నారు. టీవీ 9 ఫేమ్‌ యాంకర్‌ హరిత వినోద్‌ ప్రొడ్యూస్‌ చేసిన, మధుప్రియ పాడిన జానపద బతుకమ్మ పాటలను ఆవిష్కరించారు. ఎన్నారైలు బతుకమ్మ పాటలను పాడుతూ నృత్యం చేశారు.

టిటిఎ రీజినల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అమిత్‌ రెడ్డి, బోర్డ్‌ డైరెక్టర్స్‌ నంద దేవి శ్రీరామ, ప్రసాద్‌ ఉప్పలపాడు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. నిత్యా జూవ్వెల్లర్స్‌ సిఇఓ నిత్యారెడ్డి, టిటిఎ జనరల్‌ సెక్రటరీ శ్రీనివాస్‌ మానాప్రగడ, టిటిఎ టీమ్‌ సరస్వతి వర్కూర్‌ (ఆర్‌విపి), పవన్‌ రెడ్డి గున్నా (ఆర్‌విపి), శ్రీధర్‌ రెడ్డి బిల్లా, రవి నేతి, సతీష్‌ బానావత్‌. నాని రెడ్డి జక్కడి, సోహైల్‌, ఈషా వర్కూర్‌, ఎఫ్‌ఓజి ఎగ్జిక్యూటివ్‌ టీమ్‌ తదితరుల సహకారంతో ఈ కార్యమ్రాన్ని విజయవంతంగా చేశారు.
 

Click here for Event Gallery

 

Tags :