న్యూయార్క్‌లో టిటిఎ బతుకమ్మ సంబరాలు

న్యూయార్క్‌లో టిటిఎ బతుకమ్మ సంబరాలు

తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టిటిఎ) ఆధ్వర్యంలో న్యూయార్క్‌లో సద్దుల బతుకమ్మ వేడుకలను ఇటీవల నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గామాత విగ్రహానికి హారతులిచ్చి, లలితసహస్ర పారాయణం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ సంబరాలు చేశారు. అందంగా ఎత్తుగా పేర్చిన బతుకమ్మలకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిటిఎ అధ్యక్షుడు మోహన్‌ రెడ్డి పాటలలోళ్ళ, ఉపాధ్యక్షుడు వంశీరెడ్డి, వరంగల్‌ కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలకు చెందిన ఎన్నారైలు నాగేంద్రకుమార్‌, బాదం వేణు, గుంత లక్ష్మణ్‌ బిక్షపతి, సిరిపురం కృష్ణ తదితరులతోపాటు పెద్దఎత్తున మహిళలు పాల్గొన్నారు. 

Tags :