న్యూజెర్సిలో టీటీఎ మెగా కన్వెన్షన్

న్యూజెర్సిలో టీటీఎ మెగా కన్వెన్షన్

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి కళ్యాణం

తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యూజెర్సిలో మే 27 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించనున్న మెగా కన్వెన్షన్‌లో భాగంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. మే 29వ తేదీన ఉదయం 8 నుంచి 11 వరకు ఈ కళ్యాణత్సోవం జరుగుతుందని టిటిఎ కన్వెన్షన్‌ కన్వీనర్‌ శ్రీనివాస్‌ గనగోని, రిలిజియస్‌ కమిటీ చైర్‌ రామకృష్ణ సన్నిధి తెలిపారు. ఈ కళ్యాణోత్సవం కోసం యాదగిరిగుట్ట నుంచి వేదపండితులు, అర్చకులతోపాటు స్వామివారి విగ్రహమూర్తులను కూడా తీసుకువస్తున్నామని వారు చెప్పారు. ఈ కళ్యాణానికి కో ఆర్డినేటర్‌గా దుర్గాప్రసాద్‌ సెలోజి వ్యవహరిస్తున్నారు. కో చైర్‌గా శ్రీధర్‌ రాజు ప్రతికాంతుమ్‌, ప్రభావతి మద్దుల ఉన్నారు. టిటిఎ అధ్యక్షుడు మోహన్‌ పాటలోళ్ళ, టిటిఎ ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ వంశీరెడ్డి, కన్వెన్షన్‌ కన్వీనర్‌ శ్రీనివాస్‌ గనగోని ఇతర కమిటీలు కన్వెన్షన్‌కు అవసరమైన కార్యక్రమాల ఏర్పాట్లను ముమ్మరంగా చేస్తున్నారు. ఇప్పటికే కన్వెన్షన్‌ కోసం నియమించిన కమిటీలు తమకు కేటాయించిన పనులను ప్రణాళికతో చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. వినోదం, సమాచార, వినూత్న అత్యాధునిక సాంకేతిక సెమినార్‌లు, చర్చలు, విభిన్న రంగాలకు చెందిన వందలాది మంది ప్రముఖులతో కలిసి ప్రదర్శించే కార్యక్రమాలతో మెగా కన్వెన్షన్‌ ఆకట్టుకుంటుందని చెబుతున్నారు.

ఈ కాన్ఫరెన్స్‌లో బిజినెస్‌ స్టాల్స్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అనేక రకాల ప్రచార / సమాచార ఉత్పత్తులు, ప్రదర్శనలు, బోటిక్‌లు, జ్యువెలరీ స్టాల్స్‌తో అద్భుతమైన షాపింగ్‌ అనుభవాన్ని కూడా పొందే అవకాశాన్ని కూడా ఈ మెగా కన్వెన్షన్‌ అందిస్తోంది. సమావేశానికి హాజరయ్యే వారికోసం  భారతీయ మరియు అమెరికన్‌ వంటలను వడ్డిస్తున్నారు. రుచికరమైన ఈ వంటలను మరియు తియ్యని అనుభూతులను పొందాలంటే మీరు ఈ కన్వెన్షకు రావాల్సిందేనని నిర్వాహకులు చెబుతున్నారు.

ఈ కన్వెన్షన్‌లో ఎన్నో కార్యక్రమాలు, ఎంతోమంది కళాకారుల ప్రదర్శనలు కూడా ఉన్నాయి. ప్రముఖ  తెలుగు సినీ మరియు టీవీ కళాకారుల నృత్యం, గానం ప్రదర్శనలతో కూడిన స్థానిక మరియు అంతర్జాతీయ ప్రముఖ కళాకారులచే తెలంగాణ మరియు తెలుగు ఫుట్‌టాపింగ్‌ ప్రదర్శనలను కన్వెన్షన్‌లో ఏర్పాటు చేస్తున్నారు. లెజెండరీ సింగర్‌ పద్మవిభూషణ్‌ బాలసుబ్రహ్మణ్యంకు నివాళులు అర్పిస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన కుమారుడు ఎస్పీ చరణ్‌, ఎస్పీ శైలజతోపాటు ఉష, సింగర్‌ సునీత, కాప్రిసియో బ్యాండ్‌ ద్వారా మ్యూజికల్‌ షో. మా మెగా కన్వెన్షన్‌ నైట్‌ వంటి కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు.

 

Tags :