MKOne TeluguTimes-Youtube-Channel

న్యూజెర్సీలో ఘనంగా టీటీఏ ప్రెసిడెంట్ మీట్ అండ్ గ్రీట్

న్యూజెర్సీలో ఘనంగా టీటీఏ ప్రెసిడెంట్ మీట్ అండ్ గ్రీట్

అగ్రరాజ్యం అమెరికాలోని న్యూజెర్సీలో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) అధ్యక్షులు వంశీ రెడ్డి కంచకర్లకుంట మీట్ అండ్ గ్రీట్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న  వంశీ రెడ్డి.. న్యూజెర్సీలోని తెలుగు కమ్యూనిటీ నాయకులను కలిశారు. ఈ వేడుకలకు ఆటా, నాటా, తానా, నాట్స్, టీఎఫ్ఏఎస్, ఆంత్రప్రెన్యూర్లు సహా 200 మందికిపైగా ప్రేక్షకులు ఉత్సాహంగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని టీటీఏ జాయింట్ సెక్రటరీ శివరా రెడ్డి కొల్ల, నరసింహ పేరుక, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సాయి గుండూర్, మధుకర్ దేవరపల్లీతోపాటు టీటీఏ న్యూజెర్సీ కోర్ టీం అంతా కలిసి అద్భుతంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ వంశీరెడ్డిని న్యూజెర్సీకి ఆహ్వానించిన శివారెడ్డి.. ప్రేక్షుకులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. అలాగే తమ సంస్థ చేస్తున్న అనేక సేవా కార్యక్రమాలను వివరించారు.

ఈ క్రమంలోనే న్యూజెర్సీలో గతంలో నిర్వహించిన టీటీఏ మెగా కన్వెన్షన్ సహా పలు కార్యక్రమాల గురించి టీటీఏ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ నరసింహ పేరుక గుర్తుచేశారు. న్యూజెర్సీకి వచ్చి ఈ వేడుకలో పాల్గొన్నందుకు వంశీ రెడ్డికి టీటీఏ రీజనల్ వైస్ ప్రెసిడెంట్లు సాయి గుండూర్, మధుకర్ దేవరపల్లి ఇద్దరూ ధన్యవాదాలు తెలిపి సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన టీటీఏ అధ్యక్షులు వంశీ రెడ్డి.. ఈ అద్భుతమైన వేదికను స్థాపించిన టీటీఏ వ్యవస్థాపకులు పైళ్ల మల్లారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. టీటీఏ అడ్వైజరీ కౌన్సిల్‌ సభ్యులు చైర్మన్ హరనాథ్ పోలిచెర్ల, సహచైర్మన్ మోహన్ పాటగొళ్ల, మాజీ చైర్మన్ విజయపాల్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

 

 

Tags :