MKOne Telugu Times Business Excellence Awards

శ్రీవారి ఆలయ నిర్మాణానికి అంకురార్పణ

శ్రీవారి ఆలయ నిర్మాణానికి అంకురార్పణ

ఆధ్యాత్మిక చింతనతో కరీంనగరం మురిసిపోయింది. గోవిందనామస్మరణతో పులకించిపోయింది. మిథునలగ్నంలో భూకర్షణంతో తిరుమల శ్రీవారి ఆలయ నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. తెల్లవారుజాము నుంచి ఆలయం నిర్మించే స్థలంలో వేదపండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)  ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో భూకర్షణ హోమం, కలశారాధన, అష్టదికాల్పకుల పూజ, మండప పూజ, కన్యకాపూజ, గోపూజ,  ముతైదువ పూజ నిర్వహించారు. అనంతరం శ్రీవారి గర్బాలయం నిర్మించే స్థలంలో నాగలితో దున్ని నవధాన్యాలు వెదజల్లారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్‌ కుటుంబ సమేతంగా హాజరు కాగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌ కుమార్‌, జిల్లా కలెక్టర్‌ ఆర్వీ. కర్ణణ్‌,  ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్‌, సుంకె రవింకర్‌, జిల్లా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు జీవీ. రామకృష్ణారావు, మేయర్‌ సునీల్‌ రావు తదితరులు హాజరై పూజా కార్యక్రమాలను నిర్వహించారు.

 

 

Tags :