ఇది రైతు వ్యతిరేక నిర్ణయం..

ఇది రైతు వ్యతిరేక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించాలన్న వైసీపీ ప్రభుత్వం నిర్ణయించడం శోచనీయమని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి అన్నారు. ఈ సందర్భగా ఆయన మీడియా మాట్లాడుతూ పంపు సెట్లకు మీటర్లు బిగించడం అంటే రైతుల మెడలకు ఉర్రితాళ్లు బిగించడమే అని అన్నారు. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్‌ సరఫరా పథకాన్ని ఎత్తివేసే పన్నాగమే అని ఆరోపించారు. ఉచిత విద్యుత్‌ పథకం కాంగ్రెస్‌ పార్టీ మానస పుత్రిక అని అన్నారు. మీటర్లు బిగించడాన్ని కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకిస్తుందని అన్నారు. ఇది రైతు వ్యతిరేక నిర్ణయమన్నారు.

 

Tags :