కాలిఫోర్నియా దంపతులు.. అరుదైన ఘనత

కాలిఫోర్నియా దంపతులు.. అరుదైన ఘనత

అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ఫాతిమా, రాబర్ట్‌ దంపతులకు పుట్టిన కవలలు మాత్రం అరుదైన ఘనత  సాధించారు. పేరుకు కవలలే కానీ వీరి పుట్టిన తేదీ వేరు. అంతే కాదు వీళ్లు పుట్టిన ఏడాది కూడా మారిపోయింది. కలిసి పుట్టారన్న పేరు కానీ వీరిద్దరూ ఒకపై వేర్వేరు రోజుల్లో పుట్టిన రోజులు జరుపుకుంటారు. పాత సంవత్సరం ముగిసిపోయచే క్షణంలో ఒకరు, కొత్త సంవత్సరం ఆరంభమయ్యే క్షణాల్లో మరొకరు పుట్టడమే ఇందుకు కారణం. ఫాతిమాకు గత డిసెంబర్‌ 31న నొప్పులొచ్చాయి. ఆమె ఆ రోజు రాత్రి 11:45కు మగబిడ్డకు జన్మనిచ్చింది. సుమారు పావుగంట అనంతరం తేదీ మారగానే అంటే జనవరి 1న ఆడ శిశువును ప్రసవించింది. దీంతో మగపిల్లవాడు (ఆల్ఫ్రెడ్‌ అని పేరు పెట్టారు) 2021లో, ఆడపిల్ల (ఐలిన్‌ అని పేరు పెట్టారు) 2022లో  పుట్టినట్లయింది. సో వీరు కవలలే కానీ పుట్టినేడాదులు మాత్రం తేడా అంటూ వీరికి కాన్పు చేసిన ఆస్పత్రి ట్వీట్‌ చేసింది.

 

Tags :